శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 

కావలి పట్టణంలో నూతనంగా ప్రతిష్టించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ఆదివారం పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విదుశేఖర భారతి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. అనంతరం విధుశేఖర భారతి ఆశీర్వాదాలు ఎమ్మెల్యే తీసుకున్నారు.



google+

linkedin